ఈ నెల 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల పథకాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ధరణికోటలో ఏర్పాటు చేసిన నూతన అన్న క్యాంటీన్‌ను ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. పేదలు, కార్మికులు, విద్యార్థులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
‘అందరికీ ఆహార భద్రత’ అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజూ 2.10 లక్షల మందికి భోజనం అందిస్తుండగా, తాజాగా మరో 62 గ్రామీణ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది.
ధరణికోటలో ప్రారంభం కానున్న ఈ క్యాంటీన్ ద్వారా స్థానిక ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు, వ్యవసాయ కార్మికులు కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం పొందవచ్చు. సీఎం చంద్రబాబు హాజరయ్యే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ పథకాన్ని విస్తరించి, పేదలకు అండగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.